మిస్ యూనివర్స్ కిరీటాన్ని అమెరికాకు చెందిన 28 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ ఆర్బెన్నీ గాబ్రియెల్ దక్కించుకున్నారు. గత ఏడాది ఈ టైటిల్ పొందిన భారత హర్నాజ్ సంధు కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. మిస్ యూనివర్స్ టాప్ 16 జాబితాలో చోటు దక్కించుకున్నారు భారత దివితా రాయ్. టాప్ 5లో కూడా నిలువలేకపోయారు. అమెరికాలోని న్యూఆర్లియాన్స్లో మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ ఫైనల్లో వివిధ దేశాలకు చెందిన 80 మంది పోటీ పడ్డారు. ఈ అందాల పోటీలలో ఫస్ట్ రన్నరప్‌గా వెనెజులాకు చెందిన అమంద డుడమెల్, సెకండ్ రన్నరప్‌గా డొమెనికన్ రిపబ్లిక్కు చెందిన ఆండ్రీనా మార్టినేజ్ నిలిచారు.
మీరు మిస్ యూనివర్స్ కిరీటం గెలిస్తే ఇది సాధికారత, ప్రగతిశీల సంస్థ అని నిరూపించేందుకు ఎలా పని చేస్తారు అని జ్యూరీ అడిగిన చివరి ప్రశ్నకు, దీనినిమార్పు కోసం ఒక వాహకంగా ఉపయోగిస్తానని సమాధానం చెప్పి ప్రపంచ అందాల సుందరి కిరీటం దక్కించుకున్నారు ఆర్బెన్నీ గాబ్రియేల్.
నేను 13 ఏళ్లుగా ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నానని, ఫ్యాషన్‌ను మంచి కోసం శక్తిగా వినియోగిస్తానని, పరిశ్రమలో, నేను నా దుస్తులను తయారు చేసే సమయంలో రీసైకిల్ చేసిన పదార్థాల ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని, మానవ అక్రమ రవాణా, గృహ హింస నుండి బయటపడిన మహిళలకు స్యింగ్ క్లాసెస్ తీసుకుంటున్నానని, ఇలా దీనిని మార్పు కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. మనందరికీ ఏదో ప్రత్యేకత ఉంటుందని, ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకమైన ప్రతిభను ఉపయోగించుకోవాలన్నారు.