TG: నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో కుల వివక్షతో పేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పాప మరణించడం అమానుషమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పాప మృతికి కారణమైన వారిపై BNS 316, BNS 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.