WGL: రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును MLA దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ సచివాలయంలో MLA మంత్రిని కలిశారు. నర్సంపేట డివిజన్లో రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని త్వరితగతిన మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.