»Daggubati Abhiram Hero Getting Ready For Marriage
Daggubati abhiram: పెళ్లికి రెడీ అయిన దగ్గుబాటి హీరో..పెళ్లి కుమార్తె ఆమెనా?
దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ తర్వాత రానా హీరోగా రానిస్తున్నాడు. బాహుబలి వంటి సినిమాతో రానాకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. బాబాయ్, అబ్బాయ్ కలిసి 'రానా నాయుడు' అనే బోల్డ్ వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇక వీళ్ల దారిలోనే హీరోగా రాణించేందుకు ట్రై చేస్తున్నాడు అభిరాం(daggubati abhiram). కానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
దగ్గుబాటి బ్రదర్ సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరాం(daggubati abhiram) ఇటీవల హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆయన హీరోగా నటించిన ఫస్ట్ ఫిల్మ్ ‘అహింస’. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా(movie) అహింస ఆడియెన్స్‌ను హింస పెట్టేలా ఉందనే.. రివ్యూలు వచ్చాయి. దాంతో అభిరాంకు హీరోగా పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ త్వరలోనే మరో కొత్త సినిమాతో లక్ చెక్ చేసుకోవాలని చూస్తున్నాడు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈలోపే అభిరాం పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనట్టు తెలుస్తోంది. దగ్గుబాటి అభిరామ్‌కు పెళ్లి సంబంధం కుదిరింది.
కారంచేడుకు చెందిన చినతాత కూతురు కూతురునే పెళ్లి చేసుకోబోతున్నారు. నిశ్చితార్ధం ముహుర్తం ఆపై పెళ్లి ముహుర్తం ఫిక్స్ కావాల్సి వుంది.. అనే ట్వీట్ ఒకటి బయటికి రావడంతో.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్(viral) అవుతోంది. అంటే అభిరామ్ తన రిలేటివ్ అమ్మాయితోనే ఏడడుగులు వేయబోతున్నాడన్న మాట. అభిరామ్ వరసకి మేనత్త కూతురు..మరదిలినే పెళ్లాడబోతున్నాడు. త్వరలోనే అభిరాం నిశ్చితార్ధం, పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేయనున్నారట ఇరు కుటుంబాల పెద్దలు. ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం.. అభిరామ్ పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక.. అభిరాం అన్న రానా లాక్ డౌన్లో మిహికను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి దగ్గుబాటి ఫ్యామిలిలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయని చెప్పొచ్చు.