SKLM: పాతపట్నం మండలం కాగువాడ మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మెనూ, విద్య, వసతిపై ఆరా తీశారు. సిబ్బంది మెనూలో పెరుగుకు బదులుగా మజ్జిగ పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు అడిగినంత భోజనం వడ్డించాలని సూచించారు.