ప్రముఖ నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed) షాకింగ్ కామెంట్స్ చేసింది.తాజాగా ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియా ద్వారా తనకు ఎదురైన వేధింపుల గురించి తెలిపింది. ఒక వ్యక్తి తనను బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తున్నాడని.. తన నుండి సైబర్ సెక్స్ డిమాండ్ చేస్తున్నాడని వెల్లడించింది. ఈ వ్యక్తిపై స్థానిక పీఎస్ లో ఎఫ్ఐఆర్ (FIR) దాఖలైంది. సందేహాస్పద వ్యక్తి తనకు పంపిన టెక్స్ట్‌ల స్క్రీన్షాట్లను ఊర్ఫీ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇక ఇటీవలి చాటింగ్స్‌లో ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కనిపించింది. తన నుండి సైబర్ సెక్స్ డిమాండ్ చేస్తున్న బ్లాక్‌మెయిలర్ పై చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులను కోరినా కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వ్యక్తి నన్ను చాలా కాలంగా వేధిస్తున్నాడు.
2 సంవత్సరాల క్రితం ఎవరో నా ఫోటోను మార్ఫింగ్ చేసి షేర్ చేయడం ప్రారంభించారు. నేను దాని గురించి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసాను. నరకం అనుభవించాను. ఈ వ్యక్తి నా ఫోటోని వెతికి పట్టుకున్నాడు. మార్ఫింగ్ (Morphing) చేసాడు. తర్వాత అతనితో వీడియో సెక్స్ చేయమని నన్ను బ్లాక్ మెయిల్ చేసాడు. లేకుంటే అతను యా ఫోటోని బాలీవుడ్ వెబ్ పేజీలలో పంపిణీ చేస్తానని నా కెరీర్ నాశనం అవుతుందని బెదిరించాడు. అవును అతడు నన్ను సైబర్ రేప్ చేయమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని వెల్లడించింది.నేను గత ఏడాది ఆగస్టు 1వ తేదీన గుర్ గావ్ పోలీస్ స్టేషన్ (Mumbai Police)లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసాను. 14 రోజులు గడిచినా ఎటువంటి చర్య తీసుకోలేదు! నేను చాలా నిరాశకు గురయ్యాను. ముంబై పోలీసుల సాయం గురించి చాలా మంచిగా విన్నాను. నీ ఈ వ్యక్తి పట్ల వారి వైఖరి విచిత్రంగా అనిపించింది. అతను ఎంత మంది మహిళల(women)ను బెదిరించాడో .. వారికి తెలియజేసినప్పటికీ ఇప్పటికీ చర్య తీసుకోలేదు. ఏది ఏమైనా ఈ వ్యక్తి సమాజానికి, మహిళలకు ముప్పు” అని ఉర్ఫీ ఆవేదనను వెల్లగక్కింది.