WGL: నర్సంపేట పట్టణంలో మంగళవారం ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సు జరిగింది. మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశ్రమల్లో, కర్మాగారం లోపల, గృహ నివాసంలో గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సమస్యను ఎదుర్కొని, ఎలా సురక్షితంగా బయటపడాలో అవగాహన వస్తుందన్నారు.