RR: షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కౌన్సిలర్ దిలీప్ కాలనీలో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. గత కొన్ని రోజులుగా ప్రజలు వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్పందించిన కౌన్సిలర్ వీధిదీపాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వార్డులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, మౌలిక సదుపాయాల రూపకల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు.