మహబూబ్నగర్ పరిధిలోని దివిటిపల్లి గ్రామానికి చెందిన మారుతి భజన మండలి బృందం తిరుమల తిరుపతి దేవస్థానంలో అఖండ భజన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా భజన మండలి వారు మాట్లాడుతూ.. తిరుమలలో భజన కార్యక్రమంలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు జే.చంద్ర శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, నాగార్జున పాల్గొన్నారు.