TG: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరారు. బషీర్‌బాగ్ నుంచి తోపుడు బండిపై అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు. తోపుడు బండిపై రైతుల వినతిపత్రాలను తీసుకుని వస్తుండగా.. గన్‌పార్క్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతుల వినతిపత్రాలను తలపై పెట్టుకుని నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేసింది.