RR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ప్యాకెట్ల సంఖ్యను తగ్గించి, ఇఫ్తార్ నిధులు విడుదల చేయకుండా ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని BRS నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు తమ సొంత ఇళ్లలో తోఫా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.