»Snake Viral Video Women Catch The Two Snake At The Time
Snake Viral Video: ఒకేసారి రెండు పాములు పట్టుకున్న అమ్మాయి.. వీడియో చూస్తే గూస్బంప్స్ గ్యారెంటీ
ఆ వీడియోను షేర్ చేసిన వెంటనే దానిపై చర్చ మొదలైంది. పాములు పట్టే మహిళకి కొంత మంది మద్దతుగా ఉండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పామును ఆ మహిళే రక్షించిందని కొందరంటే, ఆ మహిళ పామును ఇబ్బందిపెడుతోందని కొందరు అంటున్నారు.
Snake Viral Video: పాము వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చాలా వీడియోలు చాలా ఆశ్చర్యకరమైనవి.. ప్రమాదకరమైనవి. ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఓ యూజర్ పాము వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో ఒక మహిళ ఒట్టి చేతులతో పామును పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది.
ఆ వీడియోను షేర్ చేసిన వెంటనే దానిపై చర్చ మొదలైంది. పాములు పట్టే మహిళకి కొంత మంది మద్దతుగా ఉండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. పామును ఆ మహిళే రక్షించిందని కొందరంటే, ఆ మహిళ పామును ఇబ్బందిపెడుతోందని కొందరు అంటున్నారు. ఆ వీడియో క్యాప్షన్‌లో “ఆమె వాటికి భయపడదు, చాలా ధైర్య వంతురాలు” అని రాసి ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ చెత్త కుప్ప వైపు వస్తున్నట్లు చూడవచ్చు. కొద్దిసేపటికే ఆమె కుప్ప వైపు వెళ్లి దాని దగ్గర దాక్కున్న రెండు పెద్ద పాముల తోకలను పట్టుకుంది. దీంతో ఆ మహిళ పాములను అదుపు చేసేందుకు ప్రయత్నించింది. కొన్నిసార్లు ఆమె చేతుల్లోంచి పాములు పారిపోయేందుకు ప్రయత్నించాయి. కానీ స్త్రీ వాటిని వెళ్ళనివ్వదు.
ఈ వీడియో ఏప్రిల్ 18న పోస్ట్ చేయబడింది. వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి మిశ్రమ స్పందనలను పొందుతోంది. వీడియో క్లిప్‌ను దాదాపు 10 లక్షల మంది వీక్షించారు. ఓ మహిళ పామును పట్టుకుంటున్న ఈ వీడియోపై ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఇలా స్పందించారు. “ధైర్యం గల మహిళకు సెల్యూట్” అని ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు.