AP: సీఎం చంద్రబాబు రాజకీయ కుట్రలో పావు సునీత అని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వివేకాను ఎవరు హత్య చేశారో ప్రపంచానికి తెలుసని అన్నారు. వివేకా హత్యతో జగన్, భారతికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. జగన్తో వివేకానందరెడ్డికి అధికారం, ఆస్తి వివాదాలు లేవని చెప్పారు. చంద్రబాబు సునీత మనసులో విషవృక్షాన్ని నాటారంటూ మండిపడ్డారు.