HYD: సిక్ విలేజ్ దర్గాలో ముస్లింలకు “రంజాన్ తోఫా” కానుకల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్ ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు కానుకలను అందజేశారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నాణ్యమైన కానుకలను అందజేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని పండుగలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.