సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఈసారి మొత్తం నాలుగు పెద్ద సినిమాలు థియేర్లోకి వస్తున్నాయి. ఇప్పటికే తమిళ్ నుంచి వారసుడు, తెగింపు థియేటర్లోకి వచ్చేశాయి. ఇక తెలుగు నుంచి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ బరిలో నువ్వా, నేనా అంటున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే వారసుడు, వీరసింహారెడ్డి ట్యూన్స్‌కు జనాలు విజిల్స్ వేస్తున్నారు. అయితే జనవరి 11న, వారిసు రిలీజ్ అయి.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక విజయ్ ఫ్యాన్స్ హంగామా అయితే మాములుగా లేదు. దాంతో వారిసు చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. చెన్నైలో అభిమానులతో కలిసి వారిసు సినిమాను చూశారు దిల్ రాజు, తమన్, వంశీ పైడిపల్లి. అయితే థియేటర్ రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందంటున్నారు. దాంతో తమన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అక్కడి మూమెంట్ చూసి.. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వారిసుతో హిట్ కొట్టేశాడు కాబట్టి.. నెక్స్ట్ వీరసింహారెడ్డి టైం స్టార్ట్ అయినట్టే. అసలే అఖండ తర్వాత.. బాలయ్యతో చేస్తున్న సినిమా కావడంతో.. తమన్ పై ఊహించని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తమన్ కూడా థియేటర్స్ యాజమాన్యం కంప్లైంట్ ఇవ్వొద్దని ముందే హెచ్చరిస్తున్నాడు. వీరసింహుడి ఉగ్రరూపాని థియేటర్స్ షేక్ అయిపోవడం ఖాయమంటున్నాడు. వారిసు సినిమాకు.. అది కూడా తమిళ్లో తమన్ అంతలా ఎమోషనల్ అయ్యాడంటే.. ఇక బాలయ్య సినిమాకు ఇంకెం చేస్తాడో చూడాలి. జై బాలయ్య సాంగ్‌లో లాగే.. స్క్రీన్ ముందు మాస్ స్టెప్పులతో దుమ్ములేపుతాడేమో చూడాలి.