స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. మూవీ మేకర్స్ కోట్లు కుమ్మరించాల్సిందే. మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడు డైరెక్టర్ శంకర్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు.. అనుకున్న ఔట్ పుట్ రావాల్సిందే. చాలా గ్రాండియర్‌గా సినిమాలు చేయడంలో శంకర్ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పాటల విషయంలో శంకర్ తగ్గేదేలే అంటుంటాడు. అందుకే గేమ్ చేంజర్ సినిమా కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
శంకర్ సినిమా (Shankar Movies)ల్లో కంటెంట్‌తో పాటు విజువల్స్, సాంగ్స్ ఓ రేంజ్లో ఉంటాయి. ముఖ్యంగా పాటల గురించి మాట్లాడుకుంటే.. శంకర్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పొచ్చు. జెంటిల్‌మేన్ సినిమా మొదలు కొని రోబో 2.0 వరకు శంకర్ సాంగ్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటాయి. ఇక రెహమాన్ ఇచ్చే ట్యూన్స్ అంతకుమించి ఉంటాయి. కానీ, ఈసారి మాత్రం శంకర్ సినిమాకు రెహమాన్ లేడు. అతని ప్లేస్‌లో తమన్ ఉన్నాడు. అయినా కూడా కేవలం సాంగ్స్ కోసమే దాదాపు 90 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ramcharan)తో ‘గేమ్ చేంజర్’ సినిమా (Game changer) చేస్తున్నాడు శంకర్. ఈ సినిమాలో ఒక్కో సాంగ్‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడట శంకర్. ఒక్కో సాంగ్ ఒక్కో డాన్స్ మాస్టర్‌తో అదిరిపోయేలా కంపోజ్ చేయించాడట. జానీ మాస్టర్, ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, బోస్కో మార్టీన్.. గేమ్ చేంజర్ సాంగ్స్ కోసం కొరియేగ్రాఫర్లుగా పని చేశారు. అద్భుతమైన లొకేషన్స్, అదిరిపోయే సెట్ వర్క్‌లో ఈ సాంగ్స్ షూట్ చేశారట. అందుకోసం దాదాపుగా 90 కోట్లకు పైగా ఖర్చు చేశారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ లెక్కన మొత్తంగా కేవలం 5 పాటల కోసం 100 కోట్ల బడ్జెట్ పెట్టారని చెప్పొచ్చు. దీంతో గేమ్ చేంజర్ ఆల్బమ్ పై ఓ రేంజ్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తమన్ (Thaman) ఈ సినిమా కోసం కొత్త బ్రెయిన్‌తో పని చేస్తున్నానని చెబుతున్నాడు. శంకర్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌కు తమన్ మాస్ ట్యూన్స్.. రామ్ చరణ్ డ్యాన్స్ కలిస్తే అదిరిపోతుందని చెప్పొచ్చు. కానీ ‘ఐ’ సినిమా విషయంలో సాంగ్స్‌తో అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లాడు శంకర్. కానీ తీరా సినిమా చూశాక డిజాస్టర్‌గా నిలిచింది. ఈ విషయంలోనే మెగా ఫ్యాన్స్ (Mega Fans) కాస్త భయపడుతున్నారు.