»Mega Star Chiranjeevi Got A Big Headache Jailer Movie In Telugu States
Chiranjeevi:కి పెద్ద తలనొప్పి వచ్చి పడిందే!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్(bhola shankar)' మూవీ ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీకి ఒకరోజు ముందుగానే సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్ట్ చేసిన జైలర్(jailer) మూవీ ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 'జైలర్' మూవీ ప్రభావం చిరు సినిమాపై పడనుందని సినీ వర్గాలు అంటున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi )భోళాశంకర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు ఈ భోళా శంకర్ తో మరో హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. మూవీ విడుదలకు దగ్గరపడుతుండటంతో, పాటలు కూడా విడుదల చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల ట్రైలర్ కూడా విడుదల చేయగా చిరు మార్క్ కనపించింది.
అయితే, ఈ మూవీ విడుదల సమయంలో చిరుకి జైలర్(jailer) రూపంలో ఓ కొత్త తలనొప్పి మొదలైంది. ఎందుకంటే, ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటం గమనార్హం. ఈ రెండు మూవీ ట్రైలర్స్ విడుదల కాగా, రెండింటిలో జైలర్ కి ప్రేక్షకులు కాస్త ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఈ లెక్కన చూస్తుంటే, జైలర్ చూడటానికే ఎక్కువ మంది ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
భోళా శంకర్(bhola shankar) అల్రెడీ తెలిసిన కథే కాబట్టి ఆసక్తి తక్కువ చూపించే అవకాశం లేకపోలేదు. USలో ప్రీ-సేల్స్‌లో జైలర్ ముందుండటం గమనార్హం. భోళా శంకర్ కంటే మైళ్ల కొద్దీ ముందున్నాడు. రజనీ(Rajinikanth) చిత్రం ప్రీ-సేల్స్‌లో దూసుకుపోతోంది. యుఎస్‌లో మిలియన్ డాలర్ల ప్రీమియర్‌కు దగ్గరగా అంచనాలు ఉన్నాయి. అయితే చిరు భోళా శంకర్ దానిలో సగమే కావడం గమనార్హం. ఇది రాబోయే కొద్ది రోజుల్లో ఊపందుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇక జైలర్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అదనపు బలంగా మారింది. భోళా శంకర్ రిమేక్ కావడం కాస్త మైనస్ అవుతోంది. అయితే తెలుగులో చిరుతో పోలిస్తే రజినీకి పెద్దగా మార్కెట్ లేదు. మరి ఈ పోటీలో విజయం ఎవరు సాధిస్తారో చూడాలి.