కృష్ణా: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామంలో జై భారత్ రైతు ఉత్పత్తి దారుల సంఘం సభ్యుల క్షేత్ర పర్యటన యాత్రను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సోమవారం జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కొత్త సాంకేతికతలను నేర్చుకొని వ్యవసాయంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.