BPT: అద్దంకి పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని వైసీపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.