Nitin Chandrakant Desai, art director in Bollywood film industry, committed suicide
suicide: బాలీవుడ్(Bollywood) చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్(art director) నితిన్ చంద్రకాంత్ దేశాయ్(Nitin Chandrakant Desai) బుధవారం ఉదయం మరణించారు. కర్జాత్‌లోని తన స్టూడియోలో శవమై కనిపించినట్లు తెలిసింది. హిందీ, మరాఠి భాషాల్లో స్టార్ హీరోల సినిమాలకు పనిచేశారు. దేశాయ్ తన కెరీర్లో హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్(Devdas), జోధా అక్బర్(Jodha Akbar), లగాన్(Lagann) వంటి చిత్రాలకు సెట్స్ వేసి ఇండస్ట్రిలో మంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా తన స్టూడియోలో శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా మంచి పేరుండి, ఎన్నో పెద్ద సినిమాలకు పనిచేసిన నితిన్ దేశాయ్ మృతి పట్ల బాలీవుడ్ యాక్టర్లు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
అయితే నితిన్ దేశాయ్ తనకు ఉన్న రూ.252 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. నితిన్ ND’s Art World Pvt Ltd, 2016, 2018లో ECL ఫైనాన్స్ నుంచి రెండు రుణాల ద్వారా రూ. 185 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో అతని ఆర్థిక ఇబ్బందులు జనవరి 2020 నుంచి ఎక్కువయ్యాయి. ఆ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.