బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది కానీ.. ఈపాటికి సోషల్ మీడియా, యంగ్ టైగర్ ఎంట్రీ విజువల్స్‌తో షేక్ అయి ఉండేది. దాంతో సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యేది. అయినా బ్రహ్మాస్త్ర పై అంచనాలు పెంచేస్తున్నారు దర్శకధీరుడు. శుక్రవారం రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన బ్రహ్మాస్త్ర మూవీ ఈవెంట్ రద్దవడంతో.. సాదాసీదాగా ప్రెస్ మీట్‌తో సరిపెట్టుకుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రణ్ బీర్ కపూర్ మాట్లాడిన తెలుగు.. సినిమా పై ఎన్టీఆర్ ఇచ్చిన హైప్.. బ్రహ్మాస్త్రపై అంచనాలు పెంచేశాయి. ఇక రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ కోసం గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేశామని.. తారక్‌తో తొడకొట్టించాలని అనుకున్నామని చెప్పాడు రాజమౌళి.
ఇక ఈ విజువల్‌ను ఫ్యాన్స్‌తో కలిసి చూడాలనుకున్నానని.. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఈ లెక్కన ఈవెంట్ ప్లానింగ్ ఎంత భారీగా చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి ఈ సినిమాను తనదైన స్టైల్లో ప్రమోట్ చేస్తున్నాడు. దాంతో బ్రహ్మాస్త్ర పై భారీ ఆశలే పెట్టుకుంది బాలీవుడ్. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాను భారీ సంఖ్యలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 9న.. ప్రపంచ వ్యాప్తంగా 8వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఇండియాలో 5వేల స్క్రీన్స్‌లలో రిలీజ్ కానుందని టాక్. మిగతా 3000 స్క్రీన్స్ ఓవర్సీస్లో రిలీజ్ కాబోతున్నట్టుగా సమాచారం. దీంతో ‘బ్రహ్మాస్త్ర’ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరి అటు బాలీవుడ్, ఇటు రాజమౌళికి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.