»Gujarat Cm Bhupendra Patel Said Parental Consent Is Mandatory For Love Marriages
Love Marriage: లవ్ మ్యారేజ్ లకు పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి!
ప్రస్తుత కాలంలో ఏ రాష్ట్రంలో చూసినా ప్రేమ వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది పేరెంట్స్ అలాంటి పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తమ రాష్ట్రంలో ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Gujarat CM Bhupendra Patel said parental consent is mandatory for love marriages
Gujarat CM: ఇటివల కాలంలో దేశంలో ప్రేమ వివాహాలు(love marriages) ఎక్కువగా అవుతున్నాయి. చాలా మంది యువతీ యువకులు తల్లిదండ్రుల ఇష్టాలను కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నారు. అక్కడితో అంతా అయిపోయిందా అంటే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అయితే పెద్దలు వారి పెళ్లిళ్లను అంగీకరించకపోవడంలో కేవలం వారి వైఖరి ఒక్కటే కారణం కాదు. దీర్ఘదృష్టి (Foresight) కూడా ఉందని ఈ విషయంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్(Gujarat CM Bhupendra Patel) సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి(Parental permission) తప్పనిసరి చేసే వ్యవస్థ కోసం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ప్రకటించారు. ఈ అంశంపై గవర్నమెంట్ బిల్లు తీసుకొస్తే మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ కూడా ప్రకటించిందన్నారు.
పాటీదార్(Patidar) వర్గానికి చెందిన సర్దార్ పటేల్ గ్రూప్ మొహ్సానా(Sardar Patel Group Mohsana)లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు అనుమతి ఇస్తేనే ప్రేమ వివాహాలు జరిగేలా చూడాలని పార్టీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు ఆయన స్పందించారు. ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్(Health Minister Rushikesh Patel) కూడా ఈ విషయంలో ఓ సలహా ఇచ్చారు. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలపై అధ్యయనం చేపట్టాలని, వాటి ఆధారంగా ఇక నుంచి ప్రేమ వివాహాలకు పెద్దల అంగీకారం ఉండేలా చట్టం తీసుకొస్తే మంచి ఫలితాలను సాధిస్తుందని సూచించారు. అయితే ప్రేమ వివాహాలకు పేరెంట్స్ అనుమతి ఉండాలన్న అంశానికి రాజ్యాంగం ప్రకారం అవకాశం ఉందా, లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.