MDCL: HIV-AIDSపై అనుమానం ఉందా..? భయాందోళన చెందకుండా ఘట్కేసర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక్కడ మీ సమాచారం గోప్యంగా ఉంచి, పరీక్షలు నిర్వహించి, వైద్యం అందజేసి కౌన్సిలింగ్ సైతం అందిస్తామన్నారు. ఘట్కేసర్, అన్నోజిగూడ, పోచారం ప్రాంతాల్లో పాజిటివ్ నిర్ధారణ జరిగిన నేపథ్యంలో ఈ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు.