Auroville City Where Money Is Not Needed Is In India
Auroville: ఇప్పుడు అంతా కృత్రిమం.. టెక్నాలజీ పెరగడం.. జీవన ప్రమాణ స్థాయి పెరగడం వల్ల అంతా ఆర్థికమే.. డబ్బులకు ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మనీకి వ్యాల్యూ ఇస్తారు. కానీ అరోవిల్ (Auroville) నగరంలో అలా కాదు.. అక్కడ డబ్బుకు ప్రయారిటీ ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్.. స్త్రీ, పురుషుడు అనే తేడా మాత్రం చూస్తారు.
తమిళనాడు రాజధాని చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో అరోవిల్ (Auroville) ఉంది. విల్లుపురం జిల్లాలో ఉన్న సిటీని సిటీ అఫ్ డాన్, సన్ ఆఫ్ డాన్ పేర్లతో పిలుస్తారు. సమాజంలో ఉన్న వివక్ష, అసమానత, అంటరానితనం, అస్పృశ్యత, వెనుకబాటు తనం రూపుమాపాలని సిటీ ఏర్పాటు చేశారు. డబ్బు లేకుంటే కులం, మతం, ప్రాంతం, వర్ణం తేడా ఉండదు. అందరూ ఒక్కటే.. అందుకే ఇక్కడ డబ్బుకు విలువ ఉండదు.
అరోవిల్లో (Auroville) 50 దేశాలకు చెందిన వారు ఉంటున్నారు. నగర జనాభా 24 వేలకు పైగా ఉండగా.. అంతా కలిసి మెలిసి ఉంటారు. ప్రతీ ఒక్కరూ ఒకరికి సేవకునిగా ఉంటారు. అరోవిల్ను స్థానికులు యూనివర్సల్ సిటీ అని పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడినుంచి ఎవరైనా సరే వచ్చి ఇక్కడ నివసించవచ్చు.
ఇదీ నేపథ్యం
1914లో పుదుచ్చేరిలో అరబిందో ఆధ్యాత్మక కార్యక్రమానికి జపాన్‌కు చెందిన మహిళ మిర్రా ఆల్పాస్పా వచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జపాన్ వెళ్లారు. తిరిగి 1920లో వచ్చి.. 1924లో అరబిందో ఆధ్యాత్మిక ఇనిస్టిట్యూట్‌లో చేరి ప్రజా సేవ చేశాడు. కొన్నేళ్ల తర్వాత 1968లో నగరాన్ని నెలకొల్పారని శాసనాలు ద్వారా తెలుస్తోంది. ఆమెకు జ్ఞాపకార్తంగా ధ్యాన మందిరం నిర్మించారు. దానికి మాతృ మందిరం అని పేరు పెట్టి.. యోగా, ధ్యానం చేస్తుంటారు.