»Sanjay Dutt Official Announces To Oppose Ram Pothineni In Puri Jagannads Double Ismart
Double ISmart: డబుల్ ఇస్మార్ట్ లో సంజయ్ దత్
పూరిజగన్నాధ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్‌కు సిక్వెల్‌గా వస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Sanjay Dutt Official Announces to Oppose Ram Pothineni in Puri Jagannad's Double ISmart
Double ISmart: పాన్ ఇండియా(Pan India) సినిమాలు వస్తున్న నేపథ్యంలో అన్ని పరిశ్రమల నుంచి స్టార్ యాక్టర్లు సైతం ఇతర భాషాల్లో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Datth) తెలుగులో నటించినున్నారు. ఇప్పటికే కేజీఎఫ్(KGF) సినిమాలో విలన్‌గా కనిపించిన ఈ బ్యాడ్ భాయ్ ఇప్పుడు పూరి జగన్నాధ్(Puri Jagannath) డైరెక్షన్లో విలన్‌గా నటించనున్నారు. రెండు సంవత్సరాల క్రితం పూరి తన సొంత బ్యానర్లో రామ్(Ram Pothineni) హీరోగా హిట్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా డబుల్ ఇస్టార్ట్(Double Ismart) రాబోతున్న విషయం తెలిసిందే. ఉస్తాద్ రామ్ పోతినేని ఎదుర్కోవడానికి ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారు. ఆయన పాత్ర పేరు బిగ్ బుల్(Big Bull). ఆ పాత్రకి సంబంధించిన ఆయన లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో సంజయ్ చాలా స్టైలీష్‌గా కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్లో సంజయ్ చేతికి రింగులు, ట్యాటులతో, సూటు వేసుకొని సిగరేట్ వెలిగిస్తూ స్టైల్‌గా ఉండగా ఆయన్ను గన్స్‌తో కొంతమంది టార్గెట్ చేసినట్టుగా అందుకు సంబంధించిన లేజర్ పాయింట్స్ ఆయన శరీరంపై కనిపిస్తున్నాయి. ఆయన మాత్రం చాలా కూల్‌గా కనిపిస్తూ తన పాత్రపై ప్రేక్షకలకు ఆసక్తిని పెంచుతున్నాడు. ముంబై నేపథ్యంలో నడిచే ఈ సినిమా, మార్చి 8వ తేదీన 2024 మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే బాలీవుడ్ నుంచి సౌత్‌లో చాలా మంది విలన్ పాత్రలు చేశారు. కొన్నాల్లు జాకీష్రాఫ్ విలన్ రాణించారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ లు ఆ దిశగా ప్రయాణిస్తున్నారు.