»Electric Shock In Muharram Procession Jharkhand Four Dead And 10 Injured
Viral video: ఊరేగింపులో విద్యుదాఘాతం..నలుగురు మృతి, 10 మందికి గాయాలు
ఈరోజు మొహరం(Muharram) పండుగ. అయితే ఈ పండుగ ఊరేగింపుకోసం పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఓ ప్రాంతానికి చేరారు. ఆ క్రమంలో వారిలో కొంత మందికి విద్యుత్ వైర్ తాగి కరెంట్ షాక్(Electric shock) కొట్టింది. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది.
జార్ఖండ్(Jharkhand)లోని బొకారో జిల్లాలో మొహర్రం(Muharram) ఊరేగింపుకు సిద్ధమవుతున్న సమయంలో ఆకస్మాత్తుగా హైటెన్షన్ విద్యుత్ వైర్(Electric shock) తగిలింది. దీంతో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెతర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖెత్కో గ్రామంలో చోటుచేసుకుంది. అయితే వారి మత జెండా ఇనుముతో ఉన్నక్రమంలో దానికి విద్యుత్ వైర్‌కు తగిలిందని బొకారో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రియదర్శి అలోక్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు కోసం సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగిందని అన్నారు. వారిలో ఎనిమిది మందిని బొకారో జనరల్ ఆసుపత్రికి తరలించగా, నలుగురు గాయపడి మరణించారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.