»Vanama Venkateswara Rao Has Filed Petition At High Court
Vanama Episode: అసెంబ్లీ కార్యదర్శి వద్దకు జలగం, సీఈసీతో భేటీ.. హైకోర్టులో వనమా పిటిషన్
వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఎన్నిక చెల్లదనే తీర్పుపై స్టే ఇవ్వాలని.. సుప్రీంకోర్టులో వెళ్లేందుకు సమయం ఇవ్వాలని కోరారు.
Vanama Venkateswara Rao Has Filed Petition At High Court
Vanama Episode: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (Vanama Venkateswara Rao) ఎన్నిక చెల్లదని హైకోర్టు ధర్మాసనం నిన్న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పిటిషన్ వేసిన ప్రత్యర్థి, జలగం వెంకట్రావ్ తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని అంటున్నారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. వనమా (Vanama) ఎన్నిక చెల్లదనే హైకోర్టు తీర్పు కాపీలను అందజేశారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కూడా కలిశారు. వనమా (Vanama) ఎన్నిక చెల్లదనే తీర్పు ప్రతులను అందజేశారు.
హైకోర్టు తీర్పు ప్రకారం జలగం వెంకట్రావ్‌ను (jalagam venkat rao) ఎమ్మెల్యే అని చెప్పడంతో.. ఆయన అసెంబ్లీ కార్యదర్శి, సీఈసీని కలిశారు. ఇటు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (Vanama) కూడా హైకోర్టును ఆశ్రయించారు. తన ఎన్నిక చెల్లదనే తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. అత్యవసర పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.
తప్పుడు వివరాలు అఫిడవిట్లో సమర్పించినందుకు వనమా వెంకటేశ్వరరావుపై (Vanama) హైకోర్టు ధర్మాసనం అనర్హత వేటు వేసింది. రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. పిటిషనర్ జలగం వెంకట్రావ్ కోర్టు ఖర్చులను కూడా చెల్లించాలని స్పష్టంచేసింది. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి జలగం వెంకట్రావ్ కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతారని పేర్కొంది. 2018లో కొత్తగూడెం నుంచి వనమా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తప్పుడు వివరాలు సమర్పించడంతో అతనిపై అనర్హత వేటు పడింది. దీనిపై ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.