»Please Wait For Four Months We Will Regulate The Traffic Bandla Ganesh
Bandla Ganesh : దయచేసి నాలుగు నెలలు ఆగండి..ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తాం : బండ్ల గణేష్
నాలుగు నెలల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తాం. ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలను చూసుకుంటామని నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ (Tollywood Producer Bandla Ganesh) మరోసారి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. 2018 ఎన్నికల ముందు పొలిటికల్‌గా చాలా హడావుడి చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో (Congress) చేరారు. కానీ టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. ఎన్నికల సమయంలో టీవీ చర్చల్లో.. ప్రెస్‌మీట్‌ల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు, అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో కోసుకుంటానని చేసిన కామెంట్స్.. ఎంటర్టైన్మెంట్ చేశాయి.! తదనంతరం 2019, ఏప్రిల్ 5న రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు.
అప్పట్నుంచీ సైలెంట్‌గా ఉంటున్నారు. మరోసారి తెలంగాణ(Telangana)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనసు మార్చుకున్నారో.. ఏమో తెలియదు గానీ తాజాగా ఆయన చేస్తున్న పొలిటికల్ కామెంట్లు చేస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క తెలంగాణలో పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రలో బండ్ల గణేష్ పాల్గొని సంఘీభావం తెలిపారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి (TS Politcs) రాబోతున్నారని వార్తలు వినిపించాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.గ్రేటర్లో గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షానికి చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. దీనిపై బండ్ల గణేష్ రాజకీయ కోణంలో స్పందించారు. IKEA వద్ద ట్రాఫిక్ జామ్ వీడియోను షేర్ చేస్తూ..’ఇది మన హైదరాబాద్ ట్రాఫిక్ జామ్.. నాలుగు నెలల తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ (Congress Govt) ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తాం.. ఏ లేకుండా ప్రజలకు చూసుకుంటాం.. దయచేసి నాలుగు నెలలు భరించండి’ అంటూ ట్వీట్ చేశారు.