ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కొట్టే వాడే లేడని చెప్పాలి. ముఖ్యంగా డైలాగ్ డెలివరీలో తారక్ తర్వాతే ఎవరైనా. అందుకే ఈసారి ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ ఉండడం ఖాయమనిపిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో.. తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. వీళ్లకు ఆస్కార్ రేంజ్లో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ఆస్కార్ సందడి మొదలు అయ్యింది.. అతి త్వరలోనే ఆస్కార్ అవార్డుల నామినేషన్స్‌ను ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పలు విభాగాల్లో ఆస్కార్ రేసులో ఉంది. అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో ఉండే ఛాన్స్ ఉందని ‘వెరైటీ’ మ్యాగజైన్ ప్రిడిక్షన్ చెప్పుకొచ్చింది. అయితే ఈసారి ఏకంగా.. ఆస్కార్ టాప్ యాక్టర్స్ ప్రిడిక్షన్ లిస్టు టాప్ 10లో ఎన్టీఆర్‌కు చోటు దక్కించుకోవడం విశేషం. ఇప్పటి వరకు ఒక భారతీయ నటుడు టాప్ 10 ప్రిడిక్షన్ లిస్ట్ లో ఉండడం ఇదే మొదటిసారి. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ కాలర్ ఎగరెస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ.. #ManofMassesNTR అనే ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక వెరైటీ ప్రిడిక్షన్ ప్రకారం.. 2023 ఆస్కార్ లిస్టులో.. మెహదీ బజెస్తానీ.. ఆస్టిన్ బట్లర్.. ఏడిన్ డాంబ్రైన్.. కోలిన్ ఫారెల్.. బ్రెండన్ ఫ్రెజర్… హ్యూ జాక్మన్.. బిల్ నైఘీ.. కుపర్ రైఫ్.. విల్ స్మిత్‌ల పేర్లను వెరైటీ మీడియా సంస్థ పేర్కొంది. ఈ జాబితాలో ఎన్టీఆర్ కూడా నిలవడం తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. మరి తారక్ ఆస్కార్ రేసులో నిలిచి సంచలనంగా నిలుస్తాడేమో చూడాలి.