If Anju Yadav comes to the fore, we will take Pawan's hand.. Yadav Sanghas
AP Politics: గతవారం శ్రీకాళహస్తి పట్టణంలో నిరసన చేస్తున్న స్థానిక జనసేన నేత కొట్టే సాయిపై సీఐ అంజు యాదవ్(Anju Yadav) దాడి చేయడాన్ని ఖండిస్తూ.. ఈ రోజు పవన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కార్యకర్తలు ఏ తప్పు చేయకున్నా దాడి చేశారని, సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఈ ఘటన యాదవ సంఘాలు మండిపడుతున్నాయి. సీఐ అంజు యాదవ్పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అనుచిత వ్యాఖ్యలు చేశారని, బీసీ మహిళ అయిన అంజు యాదవ్ జోలికొస్తే పవన్ కళ్యాణ్ తాట తీస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు. కానిస్టేబుల్ కొడుకుని అని పదే, పదే చెప్పే పవన్.. కష్టపడి సీఐ స్థాయికి ఎదిగిన అంజు యాదవ్ పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమనేని ప్రభాకర్.. వనజాక్షిపై దాడి చేసినప్పుడు పవన్ గొంతు మూగబోయిందా అని యాదవ సంఘం నేతలు ప్రశ్నించారు. రోడ్డుపై ధర్నా చేయడం వల్ల స్థానికులకు ఇబ్బంది కలగడంతో అంజుయాదవ్ డ్యూటీ ప్రకారమే ముందుకు వెళ్లారని వారు తెలిపారు
గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటచేరుకున్న పవన్ అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం సమర్పించారు. ఇటీవల శ్రీకాళహాస్తి(Sreekaalhasti)లో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్త కట్టే సాయిపై స్థానిక సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్న విషయం తెలిసిందే.