దేశ వ్యాప్తంగా రూ.2400 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను ఇవాళ మాదకద్రవ్యాల (Drugs)ను అధికారులు ధ్వంసం చేశారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎన్సీబీ టాస్క్‌ఫోర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. అయితే డ్రగ్స్‌ను ధ్వంసం(Drugs Destroyed) చేసిన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా వర్చువల్‌గా వీక్షించారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూర్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ అంశం గురించి పర్యవేక్షించారు. 1,44,000 కేజీల డ్రగ్స్ విలువ దాదాపు 2416 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ధ్వంసం చేసిన వాటిలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) హైదరాబాద్ యూనిట్ స్వాధీనం చేసుకున్న 6590 కిలోలు, ఇందౌర్ విభాగం స్వాధీనం చేసుకున్న 822 కిలోలు, జమ్మూ యూనిట్ స్వాధీనం చేసుకున్న 356 కిలోల డ్రగ్స్ ఉన్నాయి.
వీటితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మాదక ద్రవ్యాల నిరోధక సంస్థలు సైతం మత్తు పదార్థాలను నాశనం చేశాయి. దీంతో ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నాశనం చేసిన డ్రగ్స్ మొత్తం 10 లక్షల కిలోలకు చేరుకుంది. వీటి విలువ సుమారు రూ.12 వేల కోట్లు.మధ్యప్రదేశ్(Madhya Pradesh), మహారాష్ట్ర, త్రిపుర, యూపీ రాష్ట్రాల్లోనూ సీజ్ చేసిన డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు.2022 జూన్ ఒకటో తేదీ నుంచి 2023 జూలై 15వ తేదీ వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్సీబీ శాఖలు దాదాపు 9 లక్షల కేజీల డ్రగ్స్‌ను సీజ్ చేసి ధ్వంసం చేశారు. ఆ డ్రగ్స్ విలువ దాదాపు 10వేల కోట్లు ఉంటుంది. అయితే ఇది టార్గెట్ కన్నా 11 రేట్లు ఎక్కువ అని అధికారులు చెప్పారు.