మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ‘వాల్తేరు వీరయ్య’లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మెగా మాస్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ చాలా కీలకమని.. 40 నిమిషాల పాటు థియేటర్ ఊగిపోతుందని అంటున్నారు. దానికితోడు ఇప్పుడు వీరయ్య డబుల్ డోస్ అంతకుమించి అనేలా ఉంటుందనే టాక్ నడుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్లో కనిపించున్నారట. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన మెగాస్టార్.. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్‌లో గానీ, టీజర్లో గానీ.. ఎక్కడా కూడా చిరు డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా హింట్ ఇవ్వలేదు. కేవలం మెగాస్టార్ వింటేజ్ లుక్ మాత్రమే రివీల్ చేశారు. కాబట్టి ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా రొటీన్ ఎంటర్టైనర్ అని.. కాకపోతే లోపల అసలు మ్యాటరే వేరే ఉందని చెబుతున్నారు చిరు. పైగా రవితేజ కూడా చిరు సోదరుడిగా నటిస్తున్నట్టు టాక్. ఇదే నిజమైతే వాల్తేరు వీరయ్య ట్రిపుల్ డోస్ ఇవ్వడం ఖాయమంటున్నారు. చివరగా మెగాస్టార్ రీ ఎంట్రీ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150లో డ్యూయెల్ రోల్ చేయగా.. తండ్రి కొడుకులుగా అందరివాడులో ద్విపాత్రాభినయం చేసారు. ఇకపోతే.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా.. రవితేజ సరసన కేథరిన్ థెరిసా నటిస్తోంది. జనవరి 13న ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.