ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ ప్రకటించాడు చరణ్. నిజానికి ఉప్పెన తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సింది బుచ్చిబాబు. కానీ తారక్ ఇతర కమిట్మెంట్స్ వల్ల.. చరణ్‌తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు బుచ్చిబాబు. దాంతో ఇది ఎన్టీఆర్ కథేనని ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు.. ఈ సినిమా కథ మారిపోయిందని అంటున్నారు. ఈ సినిమాను ఒక స్పానిష్ మూవీకి ప్రీమేక్‌గా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా ఆ స్పానిష్ సినిమా టైటిల్ తెలియకపోయినా.. ఇది మాత్రం నిజమేనని తెలుస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు.. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చినట్టు టాక్. ఈ మధ్య రీమేక్ సినిమాలు చేయడం వల్ల నష్టాలు తప్పడం లేదు. అప్పటికే ఆయా సినిమాలు ఓటీటీలోను దర్శనమిస్తున్నాయి. అందుకే రీమేక్ చేస్తే.. జనాలకు ఎక్కడం లేదు. కానీ ఫ్రీమేక్ అలా కాదు. అధికారికంగా రీమేక్ చేయకుండా ఒక సినిమా స్టోరీ లైన్ తీసుకుని.. దాని సోల్ మిస్ అవ్వకుండా మన నెటీవిటికి తగ్గట్టుగా మార్చుకోని సినిమా చేస్తే.. సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే ఆ సినిమా చూశామనే ఫీల్ ఉండదు.. కొత్త కథగానే చూస్తారు జనాలు. అందుకే చరణ్, బుచ్చిబాబు స్పానిష్ సినిమాను ఫ్రీమేక్ చేస్తున్నారని టాక్. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.