»Bjp Mla Rajasingh Met With Minister Harish Rao This Is The Reason
Raja Singh: మంత్రి హరీష్ రావుతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ!
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా భేటీ అయ్యారు. వీరు ఏ అంశాలపై చర్చలు జరిపారని ఇరు పార్టీనేతల్లో ఆసక్తి నెలకొంది.
BJP MLA Rajasingh met with Minister Harish Rao... this is the reason
Raja Singh: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Harish Rao)తో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh ) తాజాగా భేటీ అయ్యారు. అయితే వీరు ఏ విషయాలపై చర్చలు జరిపారని ఇరు పార్టీనేతల్లో ఆసక్తి నెలకొంది. గతంలో రాజాసింగ్ మత విద్వేషాలను రగిలించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆ నేపథ్యంలో తనపై బీజేపీ(BJP) పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకమాండ్ కు బండి సంజయ్ పలు మార్లు లేఖలు రాసినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మరోపక్క, ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డి(Kishan Reddy)తో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నాయని కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ తో రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని రాజాసింగ్ చెప్పారు. ఇతర ఏ విషయాల గురించి ప్రస్థావించలేదని తెలిపారు.
రాజాసింగ్ కరుడుగట్టిన హిందుత్వవాది అన్న విషయం తెలిసిందే. గతంలో హైదరాబాద్ కు కమెడియన్ మునావర్ ఫారుఖీ రావడానికి అనుమతించిన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ, మహమ్మద్ ప్రవక్త పై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆయనపై పిడి యాక్ట్ ను నమోదు చేసి జైలుకు పంపించారు. ఈ క్రమంలో రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బిజెపి ప్రకటించింది. ఆపై బెయిల్ పై బయటకు వచ్చిన రాజాసింగ్ తనపై పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా బిజెపి నేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ మంత్రి హరీష్ రావును కేసు విషయమై కలిశాడా? లేదా ఆయన చెప్పినట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశాడా.? అని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చెక్కర్లు కొడుతున్నాయి.