TG: దేశంలో గ్యాస్ కొరత లేదని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తెలిపారు. గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారని మండిపడ్డారు. యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయని తెలిపారు. కానీ ఇక్కడ మాత్రం గ్యాస్ ధరలు పెరగలేదన్నారు. మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను నియంత్రణలో పెట్టిందని చెప్పారు. గతంలో గ్యాస్ ధర రూ.1200 ఉంటే.. మోదీ ప్రభుత్వం రూ.900 చేసిందని వెల్లడించారు.