ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన కామెంట్లపై దుమారం కొనసాగుతూనే ఉంది. రైతులకు క్షమాపణ చెప్పేవరకు ఊరిలో తిరగనివొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
Don't let Revanth roam the village, kavitha calls to the workers
Free Power: టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన పవర్ కామెంట్లు అగ్గిరాజేశాయి. హైదరాబాద్‌లో గల విద్యుత్ సౌద వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha), ఎమ్మెల్యే దానం నాగేందర్ (danam nagender) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. రేవంత్ రెడ్డి (Revanth reddy), కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రైతులు సంతోషంగా ఉండాలంటే నాణ్యమైన విద్యుత్ కావాలని కవిత (kavitha) అన్నారు.
రాష్ట్రంలోని రైతంగానికి సీఎం కేసీఆర్ (cm kcr) నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారని కవిత (kavitha) గుర్తుచేశారు. కాళేశ్వరం నీటితో అన్ని ప్రాంతాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. రైతు బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ అని రేవంత్ (Revanth reddy) వ్యాఖ్యలతో తేటతెల్లం అయ్యిందని కవిత అన్నారు. దేశాన్ని 60 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ హయాంలో రైతులు పడిన ఇబ్బందులను గుర్తుచేశారు.
#WATCH | Telangana | BRS workers and leaders, including party's MLC K Kavitha, protest in Hyderabad over State Congress chief Revanth Reddy's statement on 24-hour free electricity and water supply for farmers. pic.twitter.com/yDXvxOe2Ch
రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వొద్దు అని కవిత (kavitha) సూటిగా అడిగారు. పరిశ్రమలకు కరెంట్ ఇవ్వొద్దు అనే చెప్పై ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని అడిగారు. మూడు పూటలా అన్నం పెట్టే రైతుకు 3 గంటల విద్యుత్ ఇవ్వాలని అనడం మంచిది కాదన్నారు. రేవంత్‌ను (Revanth reddy) ఊరు పొలిమేర వరకు తరిమి కొట్టాలని సూచించారు. రైతులకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సారీ చెప్పే వరకు అతనిని గ్రామాల్లో తిరగనివ్వొద్దు అని కవిత (Kavitha) సూచించారు.
అమెరికాలో తానా సభ వేదికపై రేవంత్ (Revanth) మాట్లాడుతూ.. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా నిరసనలు చేపట్టనుంది. నాణ్యమైన విద్యుత్ ఎక్కడ ఇచ్చారని.. విద్యుత్ సంస్థలను నష్టాల్లో నెట్టారని సబ్ స్టేషన్ల వద్ద నిరసనలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.