ASF: దహెగాం మండలంలోని కర్జి గ్రామానికి చెందిన కాటెల కమలాకర్ను తహాసీల్దార్ మునవార్ షరీఫ్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై విక్రమ్ శనివారం ప్రకటనలో తెలిపారు. గ్రామంలో మద్యం తాగి గొడవలకు పాల్పడుతున్నందున సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేశామని పేర్కొన్నారు. మరోసారి గొడవలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.