BDK: అశ్వరావుపేట మండలం పాత రెడ్డిగూడెం గ్రామపంచాయతీలో కొండ రెడ్డి గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయి. శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు.