»The Temple Where Vashishta Mahamuni Worshiped Lord Krishna With Butter Is Located In Nagapatnam Tamil Nadu
Tamil Nadu: వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
వశిష్టుడ మహాముని శ్రీకృష్ణుడిని వెన్నతో చేసి కొలిచిన ప్రదేశం తమిళ్ నాడులోని నాగపట్నంలో ఉంది. వశిష్ఠమహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి ప్రతిమను చేసి ఆరాధించగా, ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడట.
The temple where Vashishta Mahamuni worshiped Lord Krishna
కలియుగం మొత్తం ఎంతో ఇష్టంగా సేవించే ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు (Lord Krishna). ఆయన్ను సామాన్య జనులే కాదు ఎంతో మంది మహర్షులు ఆరాధించారు. స్వామి సేవకై పరితపించి శ్రీకృష్ణుడి సేవలో తరించారు. తన నామస్మరణలో, కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు, వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమైన క్షేత్రంగా తిరుక్కణ్ణం (Thirukannam) గుడి కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్నే కృష్ణారణ్య క్షేత్రం అని కూడా భక్తులు పిలుస్తుంటారు.
తమిళనాడులో గల (Tamil Nadu) నాగపట్నం(Nagapatnam) సమీపంలో ఈ క్షేత్రం ఉంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం అలరారుతోంది. పూరాణం ప్రకారం ఇక్కడ వశిష్ఠ మహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి ప్రతిమను చేసి ఆరాధించగా, ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడట. వశిష్ట మహర్షిని ఆలింగనం చేసుకుని తన అనుగ్రహ వర్షాన్ని కురిపించాడు. ఇక్కడ రాత్రి వేళ ఆకులు ముడుచుకునే చింతచెట్టు.. పువ్వులు మాత్రమే తప్ప కాయలు కాయని పొగడ చెట్టు కనిపిస్తాయి. తిరుమంగై ఆళ్వార్ కీర్తించిన ఈ క్షేత్రంలో స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక భక్తులు ఈ క్షేత్రం గురించి కథలు కథలుగా చెబుతుంటారు.