కోనసీమ: అన్నదాత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా, సుభిక్షంగా ఉంటామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం కపిలేశ్వరపురం మండలం, అంగర గ్రామంలో జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మూడవ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.