VZM: డెంకాడ మండలంలోని గుణుపూరు గ్రామంలో ఎస్సై సన్యాసినాయుడు శుక్రవారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గ్రామస్థులకు చట్టాలపై అవగాహన కల్పించి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అలాగే, సైబర్ క్రైమ్ నేరాల భారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. OTPలు ఇతరులకు చెప్పడం వంటివి చేయరాదని ఆయన స్పష్టం చేశారు.