BDK: కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని ఔషధాల నిల్వ గదిని సందర్శించి అక్కడ నిల్వ ఉంచిన మందుల స్టాక్‌ను పరిశీలించారు.