Roja: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan kalyan) లపై మంత్రి రోజా(Roja) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పవర్ స్టార్ గా అభివర్ణించుకునే పవన్ కళ్యాణ్ నిజానికి ఇరిటేషన్ స్టార్, అలాగే చంద్రబాబు నాయుడు ఇమిటేషన్ స్టార్ అని విమర్శించారు. అలాగే ఏపీ ప్రజల ఆరాధ్యుడు సీఎం జగన్(CM Jagan) ఇన్స్పిరేషన్ స్టార్ అని కొనియాడారు. అంతేకాదు రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులను తిరగరాయాలన్నా అది ఏపీ సీఎం జగన్ కు మాత్రమే సాధ్యమని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇద్దరు సీఎం జగన్ కాలు మీద వెంట్రుక కూడా పీకలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాయ్ ఏపీ.. బైబై బీపీ (బాబు, పవన్).. వన్స్ అగైన్ వైఎస్సార్సీపీ’ అని నినదించారు.
గతంలో చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం ఆయన స్వలాభం కోసం విజయ డెయిరీని(Vijaya Milk Dairy) మూయించాడని, ఏపీలో ఎంతో ఆదరణ ఉన్న విజయ డెయిరీని జగన్ తిరిగి ప్రారంభిస్తున్నారని రోజా అన్నారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థ కోసం విజయ డెయిరీని మూయించారని ఆరోపించారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న విజయ డైయిరీకి జగన్ ప్రాణం పోస్తున్నారని చెప్పారు. జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని, ఎప్పుడైనా ఏపీ పోరుకు సిద్దంగా ఉంటుందని తెలిపారు.
చదవండి:Theater:లో పాప్ కార్న్, పెప్సీకి రూ.820..షాకింగ్ ధరలు