Hero Kiccha cheated Sudeep. The case was filed in the Kannada Film Chamber
Kiccha Sudeep: ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్(Kiccha Sudeep) అందరికి సుపరిచితుడే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ(Eega) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా విక్రాంత్ రోణా(Vikranth Rona) సినిమాతో మంచి కమర్షల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా మరో చిత్రంతో మనముందుకు వస్తున్నారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా46(Kicha46)వ చిత్రానికి సంబంధించిన టీజర్(Teaser) ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
అయితే హీరో సుదీప్ కన్నడ నిర్మాత ఎమ్.ఎన్ కుమార్(MN Kumar) పలు ఆరోపణలు చేశారు. ఆయన బ్యానర్ లో సినిమా చేస్తానని రెమ్యూనరేషన్ కూడా తీసుకొని వేరే వాళ్లకు మూవీ చేశాడని ఆరోపణలు చేశారు. ఆ ప్రాజెక్ట్ కోసం సుదీప్ కు రూ.9 కోట్లు ఇచ్చానని, కానీ డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని తెలిపారు. ఈ విషయం కన్నడ ఫిల్మా చాంబర్(Kannada Film Chamber) లో ఫిర్యాదు చేశానన్నారు. దాదాపు 8 ఏళ్ల ముందే వీరిమధ్య సినిమా ఒప్పందం జరిగినట్లు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి సుదీప్ డేట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు. సినిమాకు సంబంధించిన రూ. 9 కోట్లతో పాటు మరో రూ.10 లక్షలను తన వంటగది రెనోవేషన్ కోసం సుదీప్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఈ ప్రాజెక్ట్ కు ‘ముత్తటి సత్యరాజు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేశామన్నారు. అంతే కాదు ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి నంద కిశోర్ కు కూడా అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు సుదీప్ డేట్స్ ఇవ్వకుండా ఇప్పుడు తమిళ నిర్మాతతో సుదీప్ మూవీ ప్రకటించారు. 8 సంవత్సరాల క్రితమే తన వద్ద డబ్బు తీసుకొని ఇన్నాళ్లుగా తనతో సినిమా తీయడం లేదని, ఈ విషయంపై మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా తాను కలవకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇకనైనా సుదీప్ స్పందించి సమస్య పరిష్కారానికి సహకరించాలని నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ తెలిపారు.