ASR: కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) ప్రజల మనసులో నిలిచిపోయారని జిల్లా రెవెన్యూ అధికారి గోపీనాథరావు అన్నారు. జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు జిల్లా కలెక్టరేట్లో కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మొల్ల జీవన విశేషాలను వివరించారు.