PDPL: యువత డ్రగ్స్‌కు బానిస కావద్దని పెద్దపల్లి DCP భూక్య రామ్ రెడ్డి నాయక్ సూచించారు. ధర్మారం మండలం కొత్తూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి, డ్రగ్స్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.