»Politics Heated Up In Palnadu Syed Anwar Basha Remanded For 14 Days
Andhrapradesh: పల్నాడులో హీటెక్కిన రాజకీయాలు..సయ్యద్ అన్వర్ బాషాకు 14 రోజుల రిమాండ్
పల్నాడులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలో అస్వర్ సయ్యద్ బాషాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బక్రీద్ పండగ వేళ అన్వర్ ను అరెస్ట్ చేయడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పల్నాడు(Palnadu) జిల్లాలోని మాచర్ల(Macherla)లో రాజకీయాలు హీటెక్కాయి. టీడీపీ(TDP) మైనార్టీ నేత సయ్యద్ అన్వర్‌బాషా(Syed Anwar Basha)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా సివిల్ డ్రెస్సుల్లో అర్ధరాత్రి వేళ ఆయన ఇంటికెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు వచ్చినవారు ఎవ్వరో తెలియక కుటుంబీకులు ఆందోళన చెందారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆరా తీసినా కూడా ఎటువంటి సమాచారం లేదు. బక్రీద్ వేళ అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం, ఆయన ఆచూకీ తెలుసుకోవడం కోసం కుటుంబీకులు మానసిక క్షోభను అనుభించారు. అయితే పోలీసులు ఆయన్ని గురువారం కోర్టులో హాజరు పరిచారు.
కారంపూడిలో ఇటీవల గొడవ జరిగిన కేసులో అన్వర్ బాషా(Syed Anwar Basha)కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ(TDP) ఇన్ఛార్జిగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డికి అన్వర్ బాషా ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఇటీవలె ఆయన చేపట్టిన భవిష్యత్తుగా గ్యారెంటీ బస్సు యాత్రలో కీలక పాత్ర పోషించారు. జూన్ 20న వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇవరు వర్గాలపై కూడా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇప్పుడు సయ్యద్ అన్వర్ బాషాను చేర్చి పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ, టీడీపీ నేతల గొడవల్లో సయ్యద్ అన్వర్ బాషా ప్రమేయం లేకపోయినా ఆయన్ని కావాలనే హత్యాయత్నం కేసులో ఇరికించినట్లు ఆరోపణలున్నాయి. అన్వర్ ను బక్రీద్(Bukrid Festival) పండగ వేళ పోలీసులు సివిల్ డ్రెస్సులో వచ్చి అరెస్ట్ చేయడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పుడో జరిగిన ఘటనలో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే అన్వర్ సయ్యద్ బాషాను అరెస్ట్ చేసి కక్ష తీర్చుకున్నారని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీ(YCP), టీడీపీ(TDP) నేతల మధ్య కారంపూడిలో జరిగి ఘర్షణ కేసులో అన్వర్ సయ్యద్ బాషా(Syed Anwar Basha)ను నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. న్యాయమూర్తి ఇంటి వద్ద ఆయన్ని హాజరుపర్చారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. దీంతో పల్నాడు రాజకీయాలు(Politics) మరింత హీటెక్కాయి.