అన్ స్టాపబుల్ షో దూసుకుపోతోంది. నెంబర్ వన్ టాక్ షోగా.. మారిపోయింది. సెకండ్ సీజన్ లో గెస్టులు మరింత ఆసక్తికరంగా ఉండటంతో… ఎపిసోడ్స్ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఇక త్వరలోనే ఈ షోలో పవన్ కనపడునున్నాడు. ఇప్పటికే.. పవన్ తో టాక్ షో పూర్తయ్యింది. రిలీజ్ కావడమే ఆలస్యం. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి. పవన్- బాలయ్య ఎపిసోడ్.. అటు ఇండస్ట్రీలోని, ఇటు రాజకీయంగాను సంచలనం సృష్టించాలనే ఉంది. ముఖ్యంగా రాజకీయ పరంగా బాలయ్య, పవన్ ను అడిగిన ప్రశ్నలు మాములుగా లేవని తెలుస్తోంది.
టీడీపీతో పొత్తుపై పవన్ ని ఈ వేదికపై బాలయ్య ప్రశ్నించినట్లు సమాచారం . 2014 టీడీపీ-జనసేన పొత్తు ఎందుకు రిపీట్ కాకూడదు? అని బాలయ్య సూటిగా ప్రశ్నించారని తెలుస్తోంది. ఇక ఇందుకు పవన్ ఏ విధంగా స్పందించాడు అనేది ఎపిసోడ్ చూస్తే తప్ప తెలియదు. ఒక్క ఈ విషయమే కాకుండా.. వ్యక్తిగతంగాను పవన్ ను గట్టి ప్రశ్నలే వేశాడట బాలయ్య. మూడు పెళ్లిలా గురించి, ఇద్దరు అన్నల మధ్య వైరం గురించి ఇలా అన్ని సంచలనాలు సృష్టించే ప్రశ్నలనే బాలయ్య అడిగాడట.. మరి ఈ ప్రశ్నలకు పవన్ ఏ విధంగా సమాధానం చెప్పారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.