AP: రాష్ట్రంలో ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. కర్నూలు జిల్లా అత్యధికంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నందిగామ, అమరావతి, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటినట్లు చెప్పింది. విశాఖ, తుని, నరసాపురం, కావలి తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు పేర్కొంది.