AP: నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రం వద్ద కార్చిచ్చు రాచుకుంది. మంటల ధాటికి నల్లమల అడవి అగ్నికి ఆహుతవుతోంది. మహానంది క్షేత్రానికి 2 కి.మీ.ల దూరంలో అడవి తగలబడిపోతుంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అడవిలోకి ఎండుకర్రల కోసం వెళ్లిన దుండగులు తాగిన బీడీలను ఆర్పకుండా అడవిలో విసరడంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం.